
విశాఖపట్నం, 28 జూన్ (హి.స.): ని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగడం లేదు. ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రభుత్వ అతిధి గృహంలో బస చెయ్యాలి. రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తారా?. ఇది ప్రైవేట్ సంస్థకి దోచి పెట్టడం కాదా?. మన దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు లేవా?. ఈ నిర్ణయం మన ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ప్రభుత్వ భవనాలను రాష్ట్రపతి వాడుకోవాలి. అవసరం అనుకుంటే భవనాలను ఆధునీకరణ చేసుకోవాలి. మన దేశం పరువు, ప్రతిష్ట ఏం కావాలి అని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు