రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది.. బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి
రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది.. బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి
Minister


ఖమ్మం, 28 జూన్ (హి.స.)

ఖమ్మం వేదికగా రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ఈతే అదే ఖమ్మంలో రైతులకు భరోసా ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. కారు కూతలు కూస్తున్న దొరల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిసే వారి మనుసులో ఉన్న విషాన్ని కక్కుతున్నారన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఎన్నో కొత్త పథకాలు ఇచ్చామని కొటీ మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నామన్నారు. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తూ ప్రభుత్వంపై విమర్శచేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈనెల 30న జరిగే రైతుఆశీర్వాద సభకు హాజరుకాబోతున్న రైతులు, మహిళల సంఖ్యను చూసి బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోతాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande