
హనుమకొండ , 28 జూన్ (హి.స.)
హనుమకొండ జిల్లా కమలాపూర్
మండలంలో ని ఉప్పల్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఉప్పల్ మీదుగా కరీంనగర్ కు వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొనగా ప్రమాదం చోటుచేసుకుంది. కళ్లెం శ్రీనివాస్, తూర్పాటి భార్గవ్, చల్లా వెంకటేష్ కరీంనగర్ లక్ష్మీపురంకు చెందిన వారు కాగా వాహనంలోని తూర్పాటి హరికుమార్ ను స్వగ్రామం ఉప్పల్లో దించి వెళ్లామని ఉప్పల్ గ్రామం మీదుగా కరీంనగర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తూర్పాటి భార్గవ్ మృతి చెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు