
తిరుపతి, 28 జూన్ (హి.స.) : ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన ఖరారయింది.
జూలై 1, 2 తేదీల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు సత్యవేడు మండలం మాదనపాలెంలోని హీరో మోటర్స్ పరిశ్రమ విస్తరణ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు రాత్రి శ్రీసిటీ సెజ్లో బస చేసి మరుసటి రోజు, 2వ తేదీ రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేశ్ పాశ్వాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతో కలసి పర్యటిస్తారు.
వీబీ జీ రామ్ జీ పథకాన్ని జాతీయ స్థాయిలో ఇక్కడే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV