భారీ అంచనాలతో. రానున్న పెద్ది.విడుదలకు.ముందే రికార్డులు నెలకొల్పుతోంది
భారీ అంచనాలతో. రానున్న పెద్ది.విడుదలకు.ముందే రికార్డులు నెలకొల్పుతోంది
భారీ అంచనాలతో. రానున్న పెద్ది.విడుదలకు.ముందే రికార్డులు  నెలకొల్పుతోంది


అమరావతి, 03 జూన్ (హి.స.)

: భారీ అంచనాలతో రానున్న ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డులు నెలకొల్పుతోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే (జూన్ 3) విడుదల కానుంది. అక్కడ ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ చిత్రం రిలీజ్కు ముందే వన్ మిలియన్ క్లబ్లోకి చేరింది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్ను చేరుకుని రికార్డు సృష్టించింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ప్రీమియర్స్ లోనే చరణ్కు ఇదే వన్ మిలియన్ మార్క్ సినిమాగా తెలుస్తోంది.

మరోవైపు చిత్రబృందం ప్రచార జోరు పెంచింది. తాజాగా బుచ్చిబాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చరణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. పెద్ది అందరి గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతాడని చెప్పారు. అందుకు కారణం రామ్చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానమేనన్నారు. కుస్తీ సన్నివేశాల్లో దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా నటించారని ప్రశంసించారు. కంటికి గాయం అయినప్పుడు చిరంజీవి ఏమంటారో అని తనకు భయమేసిందని చెప్పారు. చరణ్కు జోడీగా జాన్వీకపూర్ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, శివరాజ్కుమార్ కీలకపాత్రలు పోషించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande