
అమరావతి, 03 జూన్ (హి.స.)
నక్కపల్లి, మండలంలోని న్యాయంపూడిలో ఓ వృద్ధురాలి నుంచి మూడు తులాల విలువైన బంగారు గాజులు చోరీకి గురయ్యాయి. సీఐ జె.మురళి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతంశెట్టి సూర్యవతి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇంటి మొదటి అంతస్తు వరండాలో సోమవారం రాత్రి నిద్రించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి చేతికున్న నాలుగు గాజులు కత్తిరించి తీసుకెళ్లిపోయాడన్నారు. దీంతో ఇంట్లో వాళ్లను లేపి విషయం తెలిపినా ఉపయోగం లేకపోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం సీఐ చోరీ జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ