
హైదరాబాద్, 03 జూన్ (హి.స.)
సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి అతివేగంగా ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న శివ అనే వ్యక్తి బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో బస్సు కింద నుంచి శివను బయటకు తీసి తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi