బాల్క సుమన్పై తప్పుడు సెక్షన్లు ఎందుకు?.. దర్యాప్తు అధికారికి నాంపల్లి కోర్టు షోకాజ్ నోటీసు
బాల్క సుమన్పై తప్పుడు సెక్షన్లు ఎందుకు?.. దర్యాప్తు అధికారికి నాంపల్లి కోర్టు షోకాజ్ నోటీసు
బాల్క సుమన్పై తప్పుడు సెక్షన్లు ఎందుకు?.. దర్యాప్తు అధికారికి నాంపల్లి కోర్టు షోకాజ్ నోటీసు

హైదరాబాద్, 03 జూన్ (హి.స.)

ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైంది. కాంగ్రెస్ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలుగా వ్యవహరించిన పోలీసులకు నాంపల్లి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాల్కసుమన్ ఎదుర్కొంటున్న ఆరోపణలకు, అతనిపై పెట్టిన సెక్షన్లకు సంబంధం లేకపోవడంతో పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ సెక్షన్లను కొట్టివేసిన జడ్జి, ఆ సెక్షన్లు నమోదుచేసిన దర్యాప్తు అధికారికి షోకాజ్ నోటీసు జారీచేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande