బాల్కసుమన్ పై పెట్టిన సెక్షన్లు చూసి జడ్జి ఆశ్చర్యపోయారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
బాల్కసుమన్ పై పెట్టిన సెక్షన్లు చూసి జడ్జి ఆశ్చర్యపోయారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
జగదీష్ రెడ్డి


హైదరాబాద్, 03 జూన్ (హి.స.)

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను చంచల్ గూడ జైలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించారు. అనంతరం జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టి చంచల్గూడ జైలులో నిర్బంధించిన మా ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మేం బీఆర్ఎస్ పార్టీ తరపున కలిశామన్నారు.

ఈ కేసు చూసినప్పుడు వాళ్లు పెట్టిన సెక్షన్లు చూసి జడ్జిగారే ఆశ్చర్యపోయారు. అసలు బాల్క సుమన్ మాట్లాడిందేంది.. మీరు పెట్టిన సెక్షన్లు ఏంది..ఆయుధాలు పట్టుకున్నట్టు ఎవరినో చంపేందుకు ప్రయత్నించినట్టు దేశద్రోహానికి పాల్పడినట్టు మొత్తం దేశంలో ఎన్ని రకాల సెక్షన్లున్నాయో అన్ని తీసుకువచ్చి ఇందులో పెట్టిర్రు. కోర్టే వారికి మొట్టికాయలు వేసి ఈ సెక్షన్లను కూడా తీసేయాలని చెప్పడం జరిగిందన్నారు.

బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ ఫిర్యాదు చేయించారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. మా పార్టీ ఎప్పుడూ కూడా హింసను ప్రేరేపించదు.. కేసీఆర్ కూడా వాటిని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇదంతా బీఆర్ఎస్ నాయకులను అణచివేయడానికి, భయపెట్టించేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదన్నారు జగదీష్ రెడ్డి.

మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్ను పేల్చేస్తామని, అడివిలోకి పోయి తుపాకులు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను చంపేస్తామని గతంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు.. అప్పుడు మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు.. లేనిది సృష్టించి బాల్క సుమన్ మీద అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. జైళ్లు, కేసులు ఏమీ మాకు కొత్త కాదు.. ఈ అణిచివేతని ఎదుర్కొని తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande