కశింకోట జాతీయరహదారి పై. మండలంలో నీ. ఎన్ జీ.పాలెం వద్ద రెండు లారీలు డీ
అమరావతి, 03 జూన్ (హి.స.) కశింకోట, జాతీయ రహదారిపై మండలంలోని ఎన్జీపాలెం వద్ద మంగళవారం సాయంత్రం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సీఐ అల్లు స్వామినాయుడు కథనం ప్రకారం.. ఇక్కడ పెట్రోలు బంకు నుంచి రహదారిపైకి వస
కశింకోట జాతీయరహదారి పై. మండలంలో నీ. ఎన్ జీ.పాలెం వద్ద రెండు లారీలు డీ


అమరావతి, 03 జూన్ (హి.స.)

కశింకోట, జాతీయ రహదారిపై మండలంలోని ఎన్జీపాలెం వద్ద మంగళవారం సాయంత్రం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సీఐ అల్లు స్వామినాయుడు కథనం ప్రకారం.. ఇక్కడ పెట్రోలు బంకు నుంచి రహదారిపైకి వస్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ డ్రైవరు కాలు స్టీరింగ్లో ఇరుక్కుపోయింది. సమాచారం అందిన వెంటనే సీఐ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో ఆ డ్రైవరును బయటకు తీయించి 108 వాహనంలో అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు లారీని పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande