
కలకత్తా, 07 జూన్ (హి.స.)
ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీతో పాటు ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ నాయకత్వంలో టిఎంసి పార్టీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, అసలు పార్టీ ఆమె చేతుల్లో నుండి చేజారిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేవలం గందరగోళం సృష్టించడానికే మమతా బెనర్జీ వెళ్తున్నారని, దేశ ప్రజలు ఇండియా కూటమిని పూర్తిగా పక్కన పెట్టేశారని ఎద్దేవా చేశారున్యూఢిల్లీలో జరగబోయే ఈ సమావేశానికి సిపిఐ(ఎం), డిఎంకె, మరియు లాలు ప్రసాద్ యాదవ్ వంటి కీలక నేతలు దూరంగా ఉంటున్నారని అగ్నిమిత్ర పాల్ తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ(ఎం), బిజెపి ఒక్కటయ్యాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై సిపిఐ(ఎం) జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారని, అందుకే వారు ఈ సమావేశానికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. అలాగే, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని ద్రోహంగా భావిస్తూ డిఎంకె ఈ భేటీని బహిష్కరించిందని, మరోవైపు ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా హాజరుకావడం లేదని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi