
తుని, 11 జూలై (హి.స.)
: ‘మీ రీల్ ఆంధ్రప్రదేశ్ను మార్చగలదు’.. అన్న నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. శుభ్రతపై సృజనాత్మకతతో చూపించే విధంగా ఆకర్షణీయమైన రీల్స్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని కోరింది. అధికారిక పేజీని ఫాలోచేసి#SwachhaAndhraకు ట్యాగ్ చేయాలని అధికారులు సూచించారు. ఎంపికైన రీల్స్ తమ అధికారిక పేజీలో ఫీచర్లు అవుతాయన్నారు. వీటిలో కొన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. రీల్స్లో పరిసరాల పరిశుభ్రత, తడి -పొడి చెత్త వేరు చేయడం, వర్మీ కంపోస్టు, వ్యర్థాలు ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించడం.. వంటి అంశాలు ఉండాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ