
ఆనందపురం, 11 జూలై (హి.స.)
: విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రోలర్ స్కేటర్ గోలగాని దినేశ్కు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రదానం చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవికి లేఖలు పంపించామన్నారు. దినేశ్ ఇప్పటివరకు అంతర్జాతీయ, జాతీయ, జిల్లా స్థాయిల్లో మొత్తం 51 పతకాలు సాధించి విశాఖ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు. ఇటీవల ఆసియా స్థాయి పోటీల్లో రజత పతకం సాధించిన దినేశ్ను మంత్రి అభినందించి సత్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ