విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి అడ్లూరి
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి అడ్లూరి
Minister


జగిత్యాల, 12 జూలై (హి.స.)

జగిత్యాల జిల్లా చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కృషితో వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించామని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగంలో మరిన్ని సంస్థలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామా అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,289 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, తెలంగాణలో 37 కేవీలు ఉన్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande