పాలాభిషేకాలు, గజమాలలు వద్దు.. పార్టీ శ్రేణులు, నాయకులకు మీనాక్షి నటరాజన్ కీలక ఆదేశాలు
పాలాభిషేకాలు, గజమాలలు వద్దు.. పార్టీ శ్రేణులు, నాయకులకు మీనాక్షి నటరాజన్ కీలక ఆదేశాలు
Aicc


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నాయకులకు పాలాభిషేకాలు, నీళ్ల అభిషేకాలు చేయవద్దని ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం అయినా ఇవి చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహారాన్ని వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. కావాలంటే పోషకాహారలోపంతో బాధపడుతున్న వారికి ఆ ఆహారాన్ని ధానం చేయాలని సూచించారు. పార్టీ సీనియర్ నాయకులు వచ్చినప్పుడు కొందరు నాయకులు జేసీబీలు, బుల్డోజర్లతో భారీ గజమాలలు వేస్తున్నారని ఈ వాహనాలు అణచివేతనకు చిహ్నాలు అని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటి నుండి ఎవరైనా జేసీబీలు, బుల్డోజర్లతో భారీ గజమాలలను నాయకులకు వేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande