ఉడాన్ (UDAN) స్కీమ్ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర మంత్రి
ఉడాన్ (UDAN) స్కీమ్ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర మంత్రి
Minister


న్యూ ఢిల్లీ, 16 జూలై (హి.స.)

సామాన్యులకు విమాన ప్రయాణాన్ని

అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకం 'ఉడాన్' (UDAN) ను మరో 10 సంవత్సరాల పాటు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ పథకం తదుపరి దశ అమలుపై ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రతి నెలా ఒక కొత్త టెర్మినల్, ఎయిర్పోర్టును అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. రాబోయే 10 సంవత్సరాలలో కొత్తగా 100 విమానాశ్రయాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నిర్దేశిత సమయంలోగా వీటిని పూర్తి చేయడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 100 శాతం భాగస్వామ్యంతో పూర్తి సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు.

చిన్న నగరాలకు విమాన సర్వీసులను మరింత పెంచేందుకు వీలుగా ప్రస్తుత స్కీమ్లోని 'వియబిలిటీ గ్యాప్ ఫండింగ్' (VGF) నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు మంత్రి వివరించారు. గతంలో ఒక విమానాశ్రయాన్ని 'అండర్సర్వ్' (Underserved) గా గుర్తించాలంటే అక్కడ వారానికి 7 కంటే తక్కువ సర్వీసులు ఉండాలనే నిబంధన ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితిని వారానికి 14, అంతకంటే తక్కువ సర్వీసులకు పెంచామని స్పష్టం చేశారు. ఈ మార్పు వల్ల దేశంలోని మరిన్ని విమానాశ్రయాలకు, ఎక్కువ రూట్లలో విమానాలు నడపడానికి విమానయాన సంస్థలకు కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందుతుందని, తద్వారా ప్రాంతీయ అనుసంధానత (Connectivity) ఊహించని స్థాయిలో మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande