
దేవరపల్లి:, 26 జూలై (హి.స.)
ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం శివారులోని పెట్రోల్ బంకు వద్ద జరిగింది. రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. కోళ్ల దాణా లోడుతో వస్తున్న లారీ ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ