
హైదరాబాద్, 26 జూలై (హి.స.)ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవంటూ సీఎం రేవంత్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం హెచ్చరిక అభ్యంతరకరమని బీజేపీ ఎన్నికల వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన, సీఎం రేవంత్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పి.సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సీఎం రేవంత్కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్