
తిరుమల, 26 జూలై (హి.స.)
తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు బయటకు విస్తరించి శిలాతోరణం వరకు బారులు తీరిన పరిస్థితి నెలకొంది.
ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిన్న శనివారం (జులై 25) ఒక్కరోజే 84,488 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 37,061 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. అదేవిధంగా, నిన్న 4.28 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.74 లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందించారు. వైద్య శిబిరాల్లో 3,789 మందికి చికిత్స అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi