బీజేపీ కార్యకర్తలకు ఏ పదవి కంటే కూడా దేశం, యువత మరియు విద్యార్థులే అత్యంత ముఖ్యం
బీజేపీ కార్యకర్తలకు ఏ పదవి కంటే కూడా దేశం, యువత మరియు విద్యార్థులే అత్యంత ముఖ్యం
Amithsha


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, బీజేపీ కార్యకర్తలకు ఏ పదవి కంటే కూడా దేశం, యువత మరియు విద్యార్థులే అత్యంత ముఖ్యమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. శనివారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ, మోదీ ప్రభుత్వం దేశ యువత భావాలను గౌరవిస్తుందని, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా అవసరమైన అన్ని సంస్కరణలను అమలు చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లకు పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఈ అడుగులు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు పూర్తి న్యాయం చేకూరుస్తాయనే నమ్మకం తనకు ఉందని షా ధీమా వ్యక్తం చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ తన పదవీ కాలంలో జాతీయ విద్యా విధానం (NEP) సమర్థవంతమైన అమలు, మాతృభాషల్లో పరీక్షల నిర్వహణ, పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్య మరియు నైపుణ్యాభివృద్ధి రంగాలలో గణనీయమైన సంస్కరణలు తీసుకువచ్చారని అమిత్ షా కొనియాడారు. పరీక్షల విధానాన్ని మరింత సమగ్రంగా, విద్యార్థి కేంద్రితంగా మార్చడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పానికి ఆయన పదవీ కాలం ఒక నిదర్శనమని పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande