డిప్యూటీ సీఎం.పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కొందరు.సోషల్.మీడియా లో దుష్ప్రచారం
డిప్యూటీ సీఎం.పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కొందరు.సోషల్.మీడియా లో దుష్ప్రచారం
pawan kalyan


అమరావతి, 03 జూలై (హి.స.)

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదని హెచ్చరించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ను రాజకీయంగా బలహీనపరిస్తే కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయవచ్చన్న వ్యూహంతో వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కేవలం వ్యూస్ కోసం, బ్లాక్మెయిలింగ్ కోసం పవన్ కల్యాణ్ పేరును ఉపయోగించడం సరికాదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రశ్నించే హక్కుంది.. కానీ హద్దులు దాటే హక్కు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా రుషికొండ ప్యాలెస్ అంశంపైనా మంత్రి స్పందించారు. రుషికొండ ప్యాలెస్ను పర్యాటకాభివృద్ధి, ప్రజల సందర్శన కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI)'ను ఆహ్వానించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా పర్యాటక శాఖకు ఏటా సుమారు రూ.7 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇకపై పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande