పోలీసులతో అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం కాదు : మంత్రి పొన్నం ప్రభాకర్
పోలీసులతో అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం కాదు : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister


హైదరాబాద్, 03 జూలై (హి.స.)

చర్చకు సై అని.. పోలీసులతో అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం తాము కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గన్ పార్క్ వద్దకు రమ్మని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదని హరీష్ రావు ఆరోపిస్తున్నారన్నారు. గన్ పార్క్ వద్దనున్న గోషా మహల్, మలక్ పేటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటే.. అక్కడికి వెళ్లామని తెలిపారు. పదే పదే తాము ఫోన్ లిఫ్ట్ చేయలేదంటున్న హరీష్ రావు... ఆయనే రాహుల్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లు కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తులని తెలియదా అని నిలదీశారు. పదేళ్లుగా బీఆర్ఎస్ తో కుమ్మక్కై లాభపడిన చెంచా గాళ్లు వచ్చి.. ఏది చెప్తే అది నమ్మి ఇష్టానుసారం మాట్లాడితే చెల్లదన్నారు. గురుకులాల్లో మొత్తం టెండర్లు రూ.1142 కోట్లు అయితే.. రూ.2 వేల కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చేతిలో పేపర్లు పట్టుకుని తిరిగినంత మాత్రాన ప్రతిపక్షాల ఆరోపణలు నిజమైపోవన్నారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలనే గురుకులాలను సెంట్రలైజ్ చేశామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande