శ్రీకాకుళం జిల్లాలో. వైసిపి అధినేత మాజీ సీఎం.వై ఎస్ జగన్ పర్యటనలో ఆ పార్టీ.నేతలు అత్యుత్సాహం
శ్రీకాకుళం జిల్లాలో. వైసిపి అధినేత మాజీ సీఎం.వై ఎస్ జగన్ పర్యటనలో ఆ పార్టీ.నేతలు అత్యుత్సాహం
jagan


శ్రీకాకుళం, 30 జూలై (హి.స.)

,జిల్లాలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లా జైలు వద్ద పోలీసులు విధించిన ఆంక్షలను వైసీపీ శ్రేణులు ఉల్లంఘించారు. పోలీసు బారికేడ్లను నెట్టుకుంటూ ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్మనోహర్ హల్చల్ చేశారు. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా ఎస్ఐపై ఆముదాలవలస ఇన్ఛార్జి చింతాడ రవి కుమార్ దురుసుగా ప్రవర్తించారు. మహిళా ఎస్ఐను రవి నెట్టేశారు.

శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు(గురువారం) వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జనసమీకరణ చేయొద్దని, రోడ్ షోలు నిర్వహించవద్దంటూ స్పష్టం చేశారు. అనుమతి తీసుకున్న ప్రకారం జైలుకు వెళ్లి అప్పలరాజును కలిసి వెళ్లిపోయేందుకు మాత్రమే పోలీసులు అంగీకరించారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం పోలీసుల ఆంక్షలను పక్కనపెట్టేశారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. జైలుకు అత్యంత సమీపంలో కిలోమీటరు ముందుగానే బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ మాజీ మంత్రి ధర్మానప్రసాద్ రావు కుమారుడు రామ్మనోహర్.. భారీగా కార్యకర్తలతో జైలు సమీపంలోకి తరలివచ్చారు. పోలీసులు చెప్పినప్పటికీ బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో పోలీసులపై దాడి చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. స్వల్ప లాఠీఛార్జి చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande