స్పెయిన్లోకి భారీగా చొరబడిన వలసదారులు.. సెయుటా సరిహద్దుల్లో ఉద్రిక్తత 18 మంది మృతి
స్పెయిన్లోకి భారీగా చొరబడిన వలసదారులు.. సెయుటా సరిహద్దుల్లో ఉద్రిక్తత 18 మంది మృతి
tensions-at-ceuta-border-leave-18-dead-572825


స్పెయిన్ , 31 జూలై (హి.స.) ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని స్పెయిన్ భూభాగం అయిన సెయుటా (Ceuta) నగరం వైపునకు మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా పోటెత్తారు. సరిహద్దు కంచెలను తెంచుకుని, తీవ్రమైన సముద్ర అల్లల్లో ఈత కొడుతూ పెద్ద సంఖ్యలో చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నీటమునిగి కనీసం 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోవడంతో పాటు స్థానిక శరణార్థి కేంద్రాలు నిండిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల వద్ద శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు, అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు స్పెయిన్ ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించింది.

చొరబడిన అక్రమ వలసదారులను తిరిగి మొరాకోకు పంపించేయాలని (డిపోర్ట్) స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయించడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. డిపోర్టేషన్ నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు అల్లర్లకు దిగడంతో స్థానిక పౌరులు, వలసదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు రహదారులపై ఉన్న వాహనాలకు నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా దళాలు విసృతంగా గస్తీ నిర్వహిస్తుండగా, అంతర్జాతీయంగా ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande