
హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు
మరింత దట్టంగా అలుముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ వైఖరి మారకపోతే ఈ వారాంతంలోనే ఆ దేశంపై భారీ స్థాయిలో ప్రతీకార దాడులు (Hit Very Hard) చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ దాడులను, చర్యలను తీవ్రతరం చేస్తే.. ఇంతకుముందు ఎన్నడూ చూడని రీతిలో అమెరికా బలగాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా వైమానిక దళాలు, యుద్ధ నౌకలు ఇప్పటికే రంగంలోకి దిగాయని, దాడులకు సంబంధించిన తుది ఆదేశాల కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ కొత్త నాయకత్వం (మొజబా ఖమేనీ), అమెరికా- ఇజ్రాయెల్ కూటమి మధ్య నెలకొన్న వివాదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరుపక్షాలు రాజీ పడకపోవడంతో ప్రాంతీయ శాంతికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. అమెరికా సైనిక వర్గాల నుంచి ఏ క్షణంలోనైనా వైమానిక దాడుల ప్రకటన రావచ్చనే వార్తలతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..