
ములుగు, 04 జూలై (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో 7 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ములుగు జిల్లా నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ (వసతితో కూడిన) కోచింగ్ అందించబడుతుంది. అనుభవజ్ఞులు, అర్హత కలిగిన ఫ్యాకల్టీచే డిజిటల్/తరగతి బోధన ఉంటుంది. ఈవెంట్స్లో రాణించడానికి ప్రొఫెషనల్ ఫిజికల్ ట్రైనర్లతో ప్రత్యేక శారీరక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ బంగారు అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. అర్హులైన అభ్యర్థులు వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి, మీ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..