
హైదరాబాద్, 04 జూలై (హి.స.)తెలంగాణ పర్యాటక సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్ వేదికగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ విధానాలు ఉన్నాయని వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రానికి ప్రశంసలు వచ్చాయని చెప్పుకొచ్చారు. హోటల్ నిర్మాణ నిబంధనల సరళీకరణకు గుర్తింపు వచ్చిందని వెల్లడించారు.
సింగిల్ విండో, FAR పెంపు పెట్టుబడులకు ఊతమిస్తున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025–30కు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. వేల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైందని వివరించారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ ప్రశంసలు రాష్ట్రానికి గౌరవమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్