ఓటర్ల నమోదుపై ఆందోళన వద్దు.. బద్వేల్ ఆర్డీఓ
ఓటర్ల నమోదుపై ఆందోళన వద్దు.. బద్వేల్ ఆర్డీఓ
ఓటర్ల నమోదుపై ఆందోళన వద్దు.. బద్వేల్ ఆర్డీఓ


కడప, 04 జూలై (హి.స.) కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పై ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అనర్హులు, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం సవరణలు చేపడతామని చెప్పారు.

బీ.ఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, పూర్తి చేసిన దరఖాస్తులను స్వీకరిస్తు న్నారని అదేవిధంగా ఇప్పటివరకు 80 వేల పైబడి ఓటర్లు ఆన్లైన్ అయ్యాయని తెలిపారు. ఓటర్లు అవసరమైన పత్రాలతో ఫారాలను సకాలంలో సమర్పించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీ.ఎల్వో లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande