భక్తికి వయసు అడ్డుకాదు.. 116 ఏళ్ల వయసులో తిరుమల మెట్లెక్కిన బామ్మ!
భక్తికి వయసు అడ్డుకాదు.. 116 ఏళ్ల వయసులో తిరుమల మెట్లెక్కిన బామ్మ!
భక్తికి వయసు అడ్డుకాదు.. 116 ఏళ్ల వయసులో తిరుమల మెట్లెక్కిన బామ్మ!


తిరుమల, 04 జూలై (హి.స.) వయసు శరీరానికే కానీ అచంచలమైన భక్తికి కాదని కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు నిరూపించారు. సాక్షాత్తూ ఆ కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవాలనే ప్రగాఢమైన పట్టుదలతో, ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో తిరుమల మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్లి కొండనెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె అపారమైన మనోబలాన్ని చూసి సోషల్ మీడియాలో ‘ఇదంతా ఆ శ్రీవారి మహిమే’ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గుండెల్లో గట్టి నమ్మకం, బలమైన సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఏదైనా సాధించవచ్చని ఈ అద్భుత ఘట్టం స్పష్టం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande