రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నాడో.. సర్కస్ నడుపుతున్నాడో.. గ్యాదరి కిశోర్ సెటైర్లు
రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నాడో.. సర్కస్ నడుపుతున్నాడో.. గ్యాదరి కిశోర్ సెటైర్లు
Telangana CM Revanth Reddy


హైదరాబాద్, 04 జూలై (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి రకరకాల పేర్లు ఉన్నాయని అన్నారు. ఒకడు రేవంత్ రెడ్డి అంటాడు.. ఒకడు రవ్వంత రెడ్డి అంటాడు.. ఒకడు హిట్లర్ రెడ్డి అంటాడు.. ఒకడు రండ రెడ్డి అంటాడని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గ్యాదరి కిశోర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారో సర్కస్ నడుపుతున్నారో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

ఎవరి భూమి వాళ్లకు ఉండాలని, భూ అక్రమాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేసీఆర్ పటిష్టమైన ధరణి పోర్టల్ తీసుకొచ్చారని గ్యాదరి కిశోర్ తెలిపారు. కానీ ధరణిని తీసివేసి భూభారతి పెట్టారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ భూభారతిలో దొంగలు పడ్డారని ఆరోపించారు. ఆ దొంగలు ఎవరో చెప్పాలని రేవంత్ రెడ్డిని అడిగారు. ఆ దొంగలు ఎవరు.. ప్రభుత్వమా? ప్రజాప్రతినిధులా? లేదా అధికారులు అది కాకుండా ఎవరైనా అతీత శక్తులా అని ప్రశ్నించారు.

20 ఏళ్ల రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి ఏం చేసినా ప్రతిపక్ష పాత్ర పోషించారని.. కానీ సీఎం అయ్యాక ఆయనకు పరిపాలనపై అవగాహన రాలేదని గ్యాదరి కిశోర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏం తెలియదని విమర్శించారు. 20 ఏళ్లలో రియల్ ఎస్టేట్ దందా చేశాడని.. అందుకే ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని అన్నారు. అందుకే భూ భారతి పోర్టల్ తెచ్చి అన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 4500 అప్లికేషన్లు ఎవరికీ తెలియకుండా భూ భారతిలో అప్రూవ్ అయ్యాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో 80 పేర్లు అప్రూవయ్యాయని.. రంగారెడ్డి జిల్లాలో నాలా కన్వర్షన్ అప్లికేషన్ పెట్టకుండానే అప్రూవ్ అయ్యాయని తెలిపారు. ఇవన్నీ ఎవరికి సంబంధం లేకుండానే అయిపోయాయని.. వాటికి కనీసం ఎవూ అప్లికేషన్లు కూడా పెట్టుకోలేదని తెలిపారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెవెన్యూ శాఖ మంత్రి రాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని గ్యాదరి కిశోర్ తెలిపారు. బీజేపీ సంప్రదింపుల్లో పొంగులేటి బిజీగా ఉన్నారని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన దందాలు, కన్‌స్ట్రక్షన్లలో బిజీగా ఉన్నాడని తెలిపారు. భూ భారతిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఎవరు మాట్లాడాలని అడిగారు. మొత్తం భూభారతిలో దాదాపు కోటి ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రయివేటు భూములను ప్రోహిబిటెడ్ లో పెట్టి బేరం మాట్లాడుకుంటున్నారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande