తిరుమల. తిరుపతి దేవస్థానానికి డా.కోడెల శివప్రసాద్ 20 లక్షల విరాళం
తిరుమల. తిరుపతి దేవస్థానానికి డా.కోడెల శివప్రసాద్ 20 లక్షల విరాళం
Tirumalai Kumaraswamy Temple


తిరుమల:, 14 ఆగస్టు (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) అనుబంధంగా ఉన్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి డా. కోడెల కుటుంబం తరఫున రూ.20 లక్షలు విరాళాన్ని అందించారు. కోడెల శివప్రసాద్ మనవళ్లు కోడెల గౌతం రూ.10 లక్షలు, కోడెల జేయాదిత్య రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని తితిదే ఈవో కార్యాలయంలో దేవస్థానం ఈవో ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందించారు. పేదలకు వైద్య సహాయం అందించేందుకు తితిదే నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు విరాళం అందించిన డా. కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande