హుజూరాబాద్ పరిధిలో భారీ కార్డన్ సెర్చ్: శాంతిభద్రతలపై పోలీసుల కఠిన నిఘా
హుజూరాబాద్ పరిధిలో భారీ కార్డన్ సెర్చ్: శాంతిభద్రతలపై పోలీసుల కఠిన నిఘా
హుజూరాబాద్ పరిధిలో భారీ కార్డన్ సెర్చ్: శాంతిభద్రతలపై పోలీసుల కఠిన నిఘా


కరీంనగర్14 ఆగస్టు (హి.స.)

కరీంనగర్ జిల్లాలో క్రైమ్ రేటును అదుపు చేయడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పోలీస్ శాఖ విస్తృతమైన తనిఖీలను చేపట్టింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి నేతృత్వంలో వందలాది మంది పోలీసు సిబ్బంది ఈ రోజు తెల్లవారుజామున వావిలాల, గండ్రపల్లి, మరియు విలాసాగర్ గ్రామాల్లో అకస్మాత్తుగా 'కార్డన్ సెర్చ్' (కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్) నిర్వహించారు. గ్రామాల సరిహద్దులను దిగ్బంధించి, ప్రతి ఇంటిని మరియు అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని వందలాది ద్విచక్ర వాహనాలతో పాటు, అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్థులకు ఆశ్రయం కల్పించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు ఉంటాయని, గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా పెంచుకోవాలని ఏసీపీ ఈ సందర్భంగా గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande