
ఉట్నూర్ - కుంటాల పరివాహక ప్రాంతం, 14 ఆగస్టు (హి.స.)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అద్భుతమైన జలపాతాలు, దట్టమైన అడవులు, చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన గిరిజన క్షేత్రాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం సరికొత్త బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక హోమ్‌స్టే (Homestay) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. మారుమూల ప్రకృతి రమణీయ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు గిరిజన సంస్కృతిని, వారి సాంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రత్యక్షంగా అనుభవించేలా ఈ హోమ్‌స్టేలు ఉపయోగపడతాయి. దీనివల్ల కేవలం పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, గిరిజన క్లస్టర్ల ఏర్పాటు ద్వారా స్థానిక గిరిజన యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు స్థానిక అటవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు నిధుల కేటాయింపులు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi