గిరిజన పల్లెల్లో ‘రాజర్షి షా గూడ’ సందడి: ప్రత్యేక చొరవపై కృతజ్ఞత
గిరిజన పల్లెల్లో ‘రాజర్షి షా గూడ’ సందడి: ప్రత్యేక చొరవపై కృతజ్ఞత
water


ఆదిలాబాద్ , 14 ఆగస్టు (హి.స.)

ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల కొలాం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక శ్రద్ధ వహించారు. తీవ్రమైన పేదరికం, రోడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు లేక దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్న గిరిజనుల సమస్యలపై ఆయన క్షేత్రస్థాయిలో స్పందించారు. నిరుపేద ఆదివాసీలకు త్వరితగతిన ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. కలెక్టర్ చూపిన ఈ అసాధారణ చొరవ మరియు మానవత్వానికి ముగ్ధులైన దహిగూడ కొలాం గూడెం గిరిజనులు తమ గ్రామానికి కృతజ్ఞతగా ‘రాజర్షి షా గూడ’ అని నామకరణం చేసుకున్నారు. ఈ రోజు కలెక్టర్ స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి, నూతనంగా నిర్మించిన మూడు ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో పనిచేస్తే ప్రజల హృదయాల్లో ఎలాంటి స్థానం లభిస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande