పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు క్షేత్రస్థాయి త్వరలోనే ప్రజాప్రతినిధులకు శిక్షణ
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు క్షేత్రస్థాయి త్వరలోనే ప్రజాప్రతినిధులకు శిక్షణ
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు క్షేత్రస్థాయి త్వరలోనే ప్రజాప్రతినిధులకు శిక్షణ

అమరావతి, 15 ఆగస్టు (హి.స.)

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు, క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్టు ఏపీ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్పమెంట్(ఏపీఎ్సఐఆర్డీ) కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. దీనికిగాను త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఆయన విజయవాడలోని ఏపీఎస్ఐఆర్డీ సంస్థలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్రంలోని నాలుగు ఎక్స్టెన్షన్ టైనింగ్ సెంటర్ల(ఈటీసీ) ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంకటకృష్ణ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే శిక్షణ.. సర్టిఫికేట్లు కోసం ఇచ్చేదిగా ఉండరాదని, ఇది ఉద్యోగులకు కెరీర్ అడ్వాన్స్గా, ప్రజాప్రతినిధులకు పాలనాపరమైన నైపుణ్యం అందించేదిగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో లక్ష మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు, లక్ష మంది స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామ పంచాయతీలకు అనుబంధంగా పనిచేసే మరో లక్ష మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande