
అమరావతి, 15 ఆగస్టు (హి.స.)
=రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్డీపీ) కింద గ్రామీణ రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్న ఆరు హెడ్ ఆఫ్ అకౌంట్లను మూసివేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయా ఖాతాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటికీ కొనసాగుతున్న లేదా పూర్తయిన పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న మరో 3 ఖాతాల నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ