అమరావతిలో మువ్వెన్నల జెండా ఎగరవేసిన సీఎం చంద్రబాబు
అమరావతిలో మువ్వెన్నల జెండా ఎగరవేసిన సీఎం చంద్రబాబు
Chandra Babu Naidu


అమరావతి, 15 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన అధికారిక వేడుకల్లో పాల్గొని మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. దేశం మరియు రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ, ప్రజలంతా దేశం నాకేం చేసింది అని కాకుండా, దేశం కోసం నేను ఏం చేయగలను (What can I do for my country) అనే ఆలోచనతో ముందుకు సాగాలని ఆయన కోరారు. 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా, అలాగే ఆంధ్రప్రదేశ్‌ను ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’గా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని (Partners in Nation Building) పిలుపునిచ్చారు. ఈ మహోన్నత వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande