
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో జాతీయ జెండాను అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో మరియు సామూహిక కృషి ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బానిసత్వపు సంకెళ్లు తెంచి స్వేచ్ఛా భారతాన్ని సాధించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi