రోడ్డు ప్రమాదంలో. ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్.మృతి
రోడ్డు ప్రమాదంలో. ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్.మృతి
accident


సర్వేపల్లి : 16 ఆగస్టు (హి.స.)

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముత్తుకూరు మండలం జంగాలకండ్రిగ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముత్తుకూరు మండలం రాజీవ్ నగర్కు చెందిన గుణ్ణం విజయ్ ప్రకాష్.. నెల్లూరు ఆర్డ్మ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరారు. మార్గంమధ్యలో జంగాలకండ్రిగ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్ప్రకాశ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో మృతి చెందారు. ఎస్సై డీవీకే రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande