ప్రజా పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే బండ్ల
ప్రజా పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే బండ్ల
MLA


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

ప్రజా పాలన ప్రభుత్వంలోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కేటీదొడ్డి మండలం యర్సన్ దొడ్డి గ్రామంలో లబ్ధిదారురాలు చంద్రకళ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ, విడతల వారీగా ₹5 లక్షలు ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 2,000 పైగా ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. లబ్ధిదారులు నిధులపై ఎలాంటి అపోహలు పడొద్దని, మిగిలిన అర్హులందరికీ రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. తమ సొంతింటి కల నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే బండ్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande