హైదరాబాద్ తో సమానంగా ములుగు అభివృద్ధి : మంత్రి సీతక్క
హైదరాబాద్ తో సమానంగా ములుగు అభివృద్ధి : మంత్రి సీతక్క
Seethakka


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ తో సమానంగా ములుగు అభివృద్ధి చెందుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మేడారం వద్ద సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, తులాభారం నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్న అనంతరం.. ములుగు జిల్లా నూతన కలెక్టరేట్ ను ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభవేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతంలో ములుగు అంటే అడవులు, అభివృద్ధి లేని ప్రాంతంగా చూసేవారని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ములుగు అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ములుగు జిల్లా కోసం 10 ఏళ్లు కొట్లాడితే.. 33వ జిల్లాగా ఇచ్చారన్నారు. ఎన్నికలకు ముందే ములుగు కలెక్టరేట్ కు శంకుస్థాపన జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టరేట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసిందన్నారు. ఏడాది కాలంలో సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న ఏకైక సీఎం.. రేవంత్ రెడ్డి ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకూ ఇవ్వనన్ని ఇందిరమ్మ ఇళ్లను ములుగు జిల్లాకు ఇచ్చారని సీతక్క తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande