
వరంగల్, 18 ఆగస్టు (హి.స.)
వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేట మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడంతో నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నర్సంపేటకు బయలుదేరుతున్న నన్నపనేని నరేందరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
నరేందర్కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో నన్నపనేని నరేందర్ కార్యాలయం వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..