ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19 ,20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19 ,20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు
Chandrababu Naidu(file)


అమరావతి, 18 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి చెన్నైలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ రిసార్ట్లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

ఆగస్టు 20వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' (Southern Zonal Council) సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande