
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
కాకతీయ విశ్వవిద్యాలయ కే-హబ్ ఆధ్వర్యంలో ఎంపికైన విద్యార్థులకు టీ-హబ్ (T-Hub) ప్రతినిధులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం విశ్వవిద్యాలయ సెనెట్‌హాల్‌లో నిర్వహించారు. కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టీ సవితా జ్యోత్స్నసారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీ-హబ్ ప్రతినిధి బాల మురళి భాస్కరన్ విద్యార్థులకు స్టార్టప్ మెంటార్‌షిప్, ఐడియా జనరేషన్, ఐడియా వ్యాలిడేషన్ తదితర అంశాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు. విద్యార్థులు తమ ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా ఎలా మలచుకోవాలి, ఒక ఆలోచనలోని కొత్తదనం, సృజనాత్మకత, సాధ్యాసాధ్యాలను ఎలా గుర్తించాలి అనే అంశాలను వివిధ ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi