22న ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం
22న ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం
22న ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం


హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)

: జనసేన (Janasena) పార్టీ జిల్లా ముఖ్య నాయకులు గాదె పృథ్వీ, పద్మజాదేవి, గడ్డం రాకేష్‌ మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ నెల 22న హనుమకొండ కేంద్రంగా జరగనున్న ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో జనసైనికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల జనసైనికులతో హనుమకొండ కేంద్రంగా ఈనెల 22 శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో వరంగల్‌ జిల్లా సమస్యలపై జనసేన పోరాటం చేసిందని, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ ప్రజాసమస్యలపై మరింత చురుగ్గా పోరాడుతామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande