
రాజన్న సిరిసిల్ల, 18 ఆగస్టు (హి.స.)
రాజన్న సిరిసిల్ల (Sircilla )జిల్లా కేంద్రంలో భారీ అగ్ని (Massive fire accident) ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దూరు శివారులోని మహాలక్ష్మి ఫర్నిచర్ దుకాణంలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా 3 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను ఆర్పి వేశారు.
ఈ ప్రమాదంలో రాత్రి దుకాణంలో నిద్రించిన ఉత్తరప్రదేశ్క చెందిన ఒక కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేంద్ర చారి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డెడ్బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దాదాపుగా 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..