బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.
Gold and silver prices fell in early trade in the bullion market


ముంబై, 18 ఆగస్టు (హి.స.)బంగారం ధరలు మరోసారి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల తగ్గిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.. తాజా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో.. మళ్లీ ఎగబాకుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. వారంలోనే బంగారం ధర రూ.3వేలకు పైగా పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,55,670 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,710 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,49,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,820, 22 క్యారెట్ల ధర రూ.1,42,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande