అత్యంత పకడ్బందీగా 'నీట్' పరీక్షల వ్యవస్థ: సుప్రీం కోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
అత్యంత పకడ్బందీగా 'నీట్' పరీక్షల వ్యవస్థ: సుప్రీం కోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
Supreme court


న్యూఢిల్లీ, 19 ఆగస్టు (హి.స.)

నీట్ (NEET) పరీక్షల నిర్వహణ విధానం అత్యంత పకడ్బందీగా (Foolproof) ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)కు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పరీక్షల భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన కీలక అంశాలను ధర్మాసనానికి వివరించారు. ప్రశ్నాపత్రాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ (GPS) పరికరాలను అమర్చామని, వాహనంలో జరిగే ప్రతి చిన్న కదలిక కూడా రికార్డు అవుతుందని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి ప్రశ్నాపత్రాన్ని నిర్ణయించకుండా, పలువురు నిపుణులు కలిసి ప్రతి సబ్జెక్టుకు 500 ప్రశ్నలతో కూడిన 'క్వశ్చన్ బ్యాంక్' తయారు చేస్తారని పేర్కొన్నారు. అందులో నుంచి ఏ ప్రశ్నలు తుది పరీక్షా పేపర్లో వస్తాయనే విషయం నిపుణులకు కూడా తెలియదని వెల్లడించారు. నీట్ పరీక్షల లీకేజీ రహిత వ్యవస్థను ఉల్లంఘించడం సాధ్యం కాదని, అత్యంత అరుదుగా మానవ తప్పిదాలు, ప్రమేయం జరిగే అవకాశం మినహా ఈ ప్రక్రియ చాలా భద్రమైనదని స్పష్టం చేశారు. పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా, లీకేజీలకు తావు లేకుండా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande