
ముంబై, 19 ఆగస్టు (హి.స.)పసిడి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి.. కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పరుగులు పెడుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో గోల్డ్ ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో పసిడి ధరలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాగా.. వారంలోనే బంగారం ధర రూ.3,500 లకు పైగా పెరిగింది. కాగా.. మంగళవారం బంగారం తులంపై రూ.230 మేర ధర పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం (ఆగస్టు 19) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,55,900 గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా కొనసాగుతోంది. అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,42,910 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,56,050, 22 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,42,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,42,910 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,42,910 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV