కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రం – పీఎస్ఆర్ వర్సెస్ జగన్మోహన్ రావు
కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రం – పీఎస్ఆర్ వర్సెస్ జగన్మోహన్ రావు
కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రం – పీఎస్ఆర్ వర్సెస్ జగన్మోహన్ రావు


మంచిర్యాల: , 22 ఆగస్టు (హి.స.)

మంచిర్యాల నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీలో చాలా కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగ విమర్శలు, పోటాపోటీ సమావేశాల స్థాయికి చేరుకోవడంతో స్థానిక క్యాడర్ అయోమయంలో పడింది. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఇరు వర్గాల నాయకులు తమ అనుచరులతో కలిసి ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తుండటంతో, పార్టీ అంతర్గత క్రమశిక్షణ పూర్తిగా తప్పిందనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది.

ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు (PSR) అధికారిక వర్గానికి, మరియు పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్న సీనియర్ నేత జగన్మోహన్ రావు వర్గానికి మధ్య ఈ వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పదవుల కేటాయింపుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంతర్గత కలహాలు రాబోయే రోజుల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, గాంధీ భవన్ పెద్దలు తక్షణమే జోక్యం చేసుకుని మంచిర్యాల కాంగ్రెస్ వివాదానికి స్వస్తి పలకాలని స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande